ఉన్నత చదువుల కోసం వెళ్లిన యువకుడు.. అనుమానాస్పద స్థితిలో మృతి

by samatah |
ఉన్నత చదువుల కోసం వెళ్లిన యువకుడు.. అనుమానాస్పద స్థితిలో మృతి
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : ఉన్నత చదువుల కోసం ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్లిన యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లి గ్రామానికి చెందిన మణికాంత్ రెడ్డి మూడేళ్ల క్రితం వైద్య విద్య అభ్యసించేందుకు ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్లాడు. ఆ దేశంలోని దవోవా మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం అతని మృతదేహం కాలేజీ సమీపంలోని ఓ కాలువలో దొరికింది. మణికాంత్ రెడ్డిని ఫిలిప్పీన్స్ దేశానికి పంపిన ఎడ్యుకేషనల్ కన్సల్టేన్సీ ప్రతినిధులు సోమవారం ఉదయం విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. దాంతో మణికాంత్ రెడ్డి కుటుంబం శోకంలో మునిగిపోయింది. కాగా, తమ కుమారుని మృతిపై మణికాంత్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేసారు. ముందు కాలేజీ భవనం పై నుంచి పడి చనిపోయినట్టు చెప్పారని, ఆ తరువాత రోడ్డు ప్రమాదంలో మరణించాడని సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. తమ బిడ్డ మృతిపై సమగ్ర విచారణ జరపాలన్నారు

Advertisement

Next Story

Most Viewed