- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ
దిశ, వరంగల్ బ్యూరో: టెన్త్ పేపర్ లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హన్మకొండ కోర్టులో దీనిపై ఇరుపక్షాల వాళ్లు వాదనలు వినిపించారు. వాదనలు ముగిసి దాదాపుగా నాలుగు గంటలవుతున్నా బెయిల్ పిటిషన్ నిర్ణయాన్ని జడ్జి ఇప్పటివరకు ప్రకటించలేదు. మరోవైపు సంజయ్ బెయిల్‌పై నిర్ణయం ప్రకటించకపోతే.. పిటిషన్ ఉపసంహరించుకుంటామని ఆయన తరపు లాయర్లు జడ్జికి తెలిపారు. బెయిల్ ఇవ్వకపోతే పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని కూడా వాదిస్తున్నారు. బెయిల్‌పై నిర్ణయం వాయిదా వేస్తే.. ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లే అవకాశం కోల్పోతామని బీజేపీ లీగల్ సెల్ భావిస్తుండటమే జడ్జికి విన్నపం చేయడానికి కారణమని తెలుస్తోంది. వారి వాదనలపై స్పందించిన జడ్జి.. పిటిషన్‌ను గ్రౌండ్స్ కింద విచారణ చేస్తానని స్పష్టం చేశారు. ఇంతవరకు ఇలాంటి కేసు చూడలేదని జడ్జి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
బెయిల్‌పై ఈరోజే తుది నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ తరపున లాయర్లు పట్టుబడుతున్నారు. మరోవైపు ఈ కేసులో బండి సంజయ్‌కు ఇప్పుడే బెయిల్ ఇస్తే.. విచారణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని పోలీసుల తరపున లాయర్లు వాదిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే బండి సంజయ్‌ను ఈ కేసులో ఇరికించారని ఆయన తరపున లాయర్లు బలంగా వాదనలు వినిపించారు. రేపు ఆయన అత్తగారి దశదినకర్మ ఉందని.. ఆ కార్యక్రమానికి ఆయన హాజరుకావాల్సి ఉందని, అలాగే ఈనెల 8న దేశ ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారని.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉందని కూడా జడ్జికి విన్నవించారు. మరోవైపు పీపీ తరపున కూడా లాయర్ల అదే స్థాయిలో వాదనలు వినిపించారు. ఈ దశలో బండి సంజయ్‌కు బెయిల్ ఇస్తే.. కేసులో సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని వాదించారు. ఈ కేసులో ఆయన ఫోన్ కూడా మిస్ అయ్యిందని.. దాని ఆధారంగా మరింత సమాచారం బయటకు రావాల్సి ఉందని వాదించారు. మొత్తంగా జడ్జి తుది నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ బీజేపీ, పోలీసు వర్గాల్లో కనిపిస్తోంది.