అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్

by Prasad Jukanti |
అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో:హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు తాము ప్రయత్నిస్తుంటే కొందరు కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పుతూ కాళ్లలో కర్ర పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. పాతబస్తీ మెట్రోను ఆపాలని ఎవరో ఢిల్లీకి లేఖ రాశారట. అలాంటి వారికి హైదరాబాద్ నగర బహిష్కరణ తప్పదని హెచ్చరిక జారీ చేస్తున్నాన్నారు. శనివారం హైదరాబాద్ లోని బైరామాల్ గూడా ప్లై ఓవర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ..హైదరాబాద్ అభివృద్ధి విషయంలో రాజీపడబోమని చెప్పారు.

కొడంగల్ లో ఓడిపోతే మల్కాజిగిరి ఎంపీగా ఇక్కడి ప్రజలు గెలిపించారని మీరు ఎంగా గెలిపించడం వల్లే తాను పీసీసీ అధ్యక్షుడిని ఆ తర్వాత సీఎంను అయ్యాన్నారు. ఇంతటి అభిమానాన్ని చూపిన మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోనన్నారు.మెట్రో రైలును విస్తరిస్తూ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ తీసుకువెళ్తామని, ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో ట్రైన్ రాబోతున్నదన్నారు. మూసీ అభివృద్ధికి టెండర్లు పిలిచామని వైబ్రంట్ తెలంగాణకు 2050కి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాబోయే వందేళ్లు గొప్పగా ఉండేలా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దబోతుున్నామన్నారు. ఆరుగ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని కాంగ్రెస్ కు అండగా నిలవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed