ఫుడ్ సరిగ్గా లేదు! రోడ్డెక్కిన ఎస్టీ హాస్టల్ విద్యార్థులు

by Ramesh N |   ( Updated:2024-04-28 13:04:20.0  )
ఫుడ్ సరిగ్గా లేదు! రోడ్డెక్కిన ఎస్టీ హాస్టల్ విద్యార్థులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్టీ హాస్టల్ విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజామాబాద్ జిల్లాలో ఉండే ఎస్టీ హాస్టల్లో రెండేళ్లుగా వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హాస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం సరిగ్గా పెట్టడం లేదని, తాగునీరు కూడా సరిగ్గా ఉండట్లేదని ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలోనే నిన్న రోడ్డుపై కుళ్లిన కూరగాయలు పారబోసి హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed