విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె.. రెగ్యులరైజేషన్‌పై పోరాటాం

by Vinod kumar |
విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె.. రెగ్యులరైజేషన్‌పై పోరాటాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ సంస్థలోని ఆర్టీజన్లు, అన్ మ్యాన్డ్ కార్మికులు, పీస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. మే 5వ తేదీ నుంచి ఆర్టీజన్లు ఈ సమ్మెకు దిగుతున్నట్లు తెలంగాణ స్టేట్ యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్ కో, జెన్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టీజన్లను కన్వర్షన్ చేయాలని ఇప్పటికే పలుమార్లు యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, అందుకే సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె.. రెగ్యులరైజేషన్‌పై పోరాటాంఅలాగే ఆర్టీజన్లు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనన్స్ ఉద్యోగులు చేస్తున్న పనులనే అన్ మ్యాన్డ్ కార్మికులు చేస్తున్నారని, వారికి కూడా తగిన గుర్తింపు లేదన్నారు. వారిని ఆర్టీజన్లుగా గుర్తించాలని డిమాండ చేశారు. వారితో పాటు సంస్థను నమ్ముకుఇని 6500 మంది పీస్ రేట్ కార్మికులు, రెవెన్యనూ, క్యాషియర్, స్పాట్ బిల్లర్లు, ఇతర కార్మికులు చాలా తక్కువ కమిషన్ తో పనిచేస్తున్నారని, వారికి కనీస వేతనాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. అందుకే నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు స్పష్టంచేశారు. 33/11 కేవీ సబ్ స్టేషన్లలో 4వ ఆపరేటర్ ను సైతం నియమించాలని తెలంగాణ స్టేట్ యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story