స్టైఫండ్​ ఇవ్వకపోతే స్ట్రైకే..! రెడీ అవుతున్న ఈఎస్‌ఐ పీజీ స్టూడెంట్స్

by Hamsa |
స్టైఫండ్​ ఇవ్వకపోతే స్ట్రైకే..! రెడీ అవుతున్న ఈఎస్‌ఐ పీజీ స్టూడెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆరు నెలల స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈఎస్ఐ సనత్‌నగర్​ పీజీ డాక్టర్లు స్ట్రైక్‌కు రెడీ అవుతున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి వారికి స్టైఫండ్ ఇవ్వలేదు. దీంతో విధులు బహిష్కరించాలని వారు ఇంటర్నల్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే డీన్‌ను పలుమార్లు సంప్రదించినా..సమస్య పరిష్కారం కావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఇటీవల మెడికోల అటెండెన్స్​వివరాల సేకరణతో పాటు ఎంప్లాయ్ ఐడీ జనరేషన్​వంటివి కూడా పూర్తయ్యాయి. అయినా పీజీ మొదటి సంవత్సరం మెడికోలకు స్టైఫండ్ అందలేదు. దీనిపై మెడికల్​కాలేజీ అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సెంట్రల్​మినిస్టర్​కిషన్​రెడ్డికి కూడా ఫిర్యాదు చేయాలని స్టూడెంట్స్ భావిస్తున్నట్లు తెలిసింది. కాలేజీ యాజమాన్యం స్టైఫండ్ ఇవ్వకుండా సతాయిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం విచిత్రంగా ఉన్నదని స్టూడెంట్ పేర్కొంటున్నారు.

వర్క్‘​ప్రెజర్’..

ఈఎస్‌ఐ మెడికల్​కాలేజీకి పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కార్మికులు, పేదలు ఎక్కువ మంది వస్తుంటారు. సరైన స్టాఫ్​లేక ఉన్నోళ్లపైనే పని భారం పడుతుంది. వైద్య సేవలన్నీ తమతోనే నెట్టుకొస్తున్నారని మెడికోలు ఆరోపిస్తున్నారు. వర్క్​చేయించుకుని ఆరు నెలలుగా స్టైఫండ్​ఇవ్వకపోవడం విచిత్రంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యూషన్​ ఫీజు రూ.2.5 లక్షలుస్టైఫండ్​ఇవ్వకపోతే స్ట్రైకే..!

ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీలో ప్రతి సంవత్సరం ట్యూషన్​పేరుతో ఫీజు రూ.2.5 లక్షలు, హాస్టల్ ఫెసిలిటీ అవసరమైన వారి నుంచి ప్రతి నెలా రూ.15 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీ అంటూనే మెడికోల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. మరోవైపు పేమెంట్ మెథడ్‌లోనూ కొద్ది శాతం మందికే హాస్టల్​సౌకర్యం కల్పిస్తున్నారని మెడికోలు స్పష్టం చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియాలతో పోల్చితే ఇక్కడ హాస్టల్ ఫీజులు అధికంగా ఉన్నాయని పీజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story