- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Balaram Naik: తన మీద దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ ఎంపీ స్ట్రాంగ్ రిప్లై
దిశ, డైనమిక్ బ్యూరో: తన మీద దుష్ప్రచారం చేస్తే.. చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోడం జరుగుతుందని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. బలరాం నాయక్ సహా కొందరు ఎంపీలు లోక్ సభకు హజరు కాలేదని, వారి పేర్లను, ఫోటోలను ప్రస్తావిస్తూ.. తెలుగు స్క్రైబ్ ట్వీట్ట్ చేసింది. ఈ పోస్ట్ కు రిప్లై ఇచ్చిన బలరాం నాయక్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని ఖండించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని వివిధ చర్చల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రశ్నలు అడగడం జరిగింది అని స్పష్టం చేశారు. కానీ నేను సమావేశాల్లో అసలు పాల్గొనలేదు అని నా మీద, నా తోటి కాంగ్రెస్ సభ్యుల మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారి పట్ల చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంపీ బలరాం నాయక్ హెచ్చరించారు.
కాగా ఆ 9 మంది తెలంగాణ ఎంపీలు లోక్ సభలో ఒక్క ప్రశ్న కూడా అడగలేదు అని చెబుతూ.. ఇటీవల జరిగిన లోక్ సభ సమావేశాల్లో తెలంగాణకు చెందిన ఐదుగురు ఎంపీలు సమావేశాలకు హాజరు కాలేదు.. మరో నలుగురు ఎంపీలు హాజరైనా, ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదని తెలిపింది. ఇందులో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, కాంగ్రెస్ ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ లోక్ సభ సమావేశాల్లో అసలు పాల్గొనలేదని, మిగతా నలుగురిలో బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి లోక్ సభ సమావేశాల్లో హాజరైనా ఒక్క ప్రశ్న వెయ్యలేదని తెలుగు స్క్రైబ్ ట్వీట్ చేసింది.