వీధి కుక్కల దాడుల సమస్యలను పరిష్కరించాలి: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

by Mahesh |
వీధి కుక్కల దాడుల సమస్యలను పరిష్కరించాలి: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : కుక్కల ర‌క్షణ కంటే మనుషుల ర‌క్షణే అవ‌స‌ర‌మ‌ని గుర్తించి భ‌యంక‌రంగా వీధుల్లో తిరుగుతున్న వీధికుక్కల‌ను చంపేందుకు త‌గిన ఆదేశాలు ఇవ్వాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి కోరారు. మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్యద‌ర్శి కి సోమవారం లేఖ రాశారు. రాష్ట్రంలో వీధి కుక్కల బెడ‌ద పెరిగిందన్నారు. జీహెచ్ఎంసీ స‌ర్వే ప్రకారం కేవ‌లం ఒక హైద‌రాబాదులోనే సుమారు 4 ల‌క్షల శున‌కాలు ఉన్నాయ‌ని తేలిందన్నారు. ప‌సిపిల్లల‌ను వీధి కుక్కలు వెంబ‌డించి తీవ్రంగా గాయ‌ప‌ర‌చ‌డం, కొన్ని సంద‌ర్భాల‌లో శ‌రీర భాగాల‌ను తిన‌డం టీవీల‌లో చూసిన‌ప్పుడు హృద‌యం క‌ల‌చివేస్తుందన్నారు. వీధుల్లో స్వైర‌విహారం చేస్తున్న వీధి కుక్కల‌కు య‌జ‌మానులు లేరని, జీహెచ్‌ఎంసీ చ‌ట్టం సెక్షన్ 249 ప్రకార‌ం యాజ‌మానులు లేని వీధి కుక్కల‌ను చంపి వేయ‌వ‌చ్చు అని పేర్కొన్నారు.

జీహెచ్ ఎంసీలో భార‌త ఏనిమ‌ల్ వెల్ఫేర్ బోర్డు స‌ల‌హాలు పాటించ‌డానికి స‌రైన యంత్రాంగం లేనందున ఆ బోర్డు స‌ల‌హాలు కాగితాల‌కే ప‌రిమిత‌మైందన్నారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట కుక్క కాటు కేసులు వ‌స్తున్నప్పుడు బోర్డు ఆదేశాలు ఆచ‌ర‌ణీయంకాదన్నారు. బోర్డు వారి స‌ల‌హాలు ప్రజ‌ల ప్రాణాల కంటే కుక్క ప్రాణాల‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2015 నవంబర్ 18న సుప్రీం కోర్టు “కుక్కల‌ను మాన‌వీయ‌తా దృక్పథంతో చూడాలన్న దానిపై ఎటువంటి అభ్యంత‌ర‌ం లేదు. వాటిని విచ్చల‌విడిగా చంప‌దారు. కానీ మనుషుల‌ను కుక్కల బారినుంచి కాపాడుట కూడ ముఖ్యమైన‌దేనని, పాల‌న యంత్రాంగం అల‌స‌త్వం వ‌ల‌న‌ ప్రజ‌లు కుక్కల కాటుతో ఎవ‌రూ బాధ‌ప‌డ‌కూడ‌దు’ అని వీట‌న్నింటిని దృష్టిలో ఉంచుకొని వీధి కుక్కలను చంపేందుకు జీహెచ్ఎంసీ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed