- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చిట్టచివరి స్థానంలో రాష్ట్ర యూనివర్సిటీలు.. 70వ స్థానంలో ఉస్మానియా: కాసం వెంకటేశ్వర్లు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో విద్యా విధానం అధోగతి పాలైందని, నేషనల్ ర్యాంకింగ్స్ లో తెలంగాణకు చెందిన యూనివర్సిటీలు చిట్టచివరి స్థానంలో ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమానికి కేంద్రంగా ఉన్న యూనివర్సిటీల ప్రతిష్ట దిగజార్చారని ఆయన ఫైరయ్యారు. ఇటీవల ప్రకటించిన ఎన్ఐఆర్ఎఫ్ జాబితాలో ఉస్మానియా యూనివర్సిటీ 70వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. జేఎన్టీయూ వంటి సంస్థలు ఆ జాబితాలోనే లేవని ప్రకటించారు. ఒక్క కాలేజీ కూడా వంద లోపు ర్యాంకులో లేదన్నారు. అదే.. తెలంగాణలో ఉన్న సెంట్రల్ ఇనిస్టిట్యూట్లు మాత్రం వాటి ర్యాంకును మెరుగుపరుచుకున్నాయని వెల్లడించారు.
యూనివర్సిటీ లో భారీ ఎత్తున ఖాళీలు ఉన్నాయని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రీసెర్చ్ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదన్నారు. 40 అగ్రికల్చర్ కాలేజీలకు ర్యాంకులు ఇస్తే జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 37 వ ర్యాంక్ లో ఉండటం గమనార్హమని కాసం పేర్కొన్నారు. ఖాళీలు భర్తీ చేస్తానని రేవంత్ ప్రకటించారని, కానీ దీనికి సెర్చ్ కమిటీ కూడా వేయలేదని మండిపడ్డారు. 9 ఏండ్ల నుంచి ర్యాంకింగ్స్ ఇస్తున్నారని, అయినా ఎన్నడూ ఇంత అధ్వానంగా ర్యాంకులు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయలేదని వెంకటేశ్వర్లు విమర్శలు చేశారు. హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అని గొప్పలు చెప్పుకుంటామని, కానీ ఐదు వేల స్కూళ్లలో కనీసం మంచి నీటి సౌకర్యం, 50 శాతం స్కూల్స్ లో అమ్మాయిలకు టాయిలెట్స్ లేవని ఆయన పేర్కొన్నారు.
టీచర్ల నియామకం మాట ఏమైందని కాసం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 6 వేలకు పైగా స్కూళ్లు సింగిల్ టీచర్ తో నడుస్తున్నాయని, 30 వేల ప్రభుత్వ స్కూళ్లలో 29 లక్షల మంది విద్యార్థులుంటే.. పది వేలు ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో 30 లక్షల మంది విద్యార్థులు చదవడం శోచనీయమన్నారు. యూనివర్సిటీలకు వీసీలను నియమించడంతో పాటు ఖాళీలు భర్తీ చేయాలని, స్కూళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవన్నీ చేయకుంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పట్టడం ఖాయమని కాసం వెంకటేశ్వర్లు హెచ్చరించారు. రుణమాఫీ కాలేదని తాము పెట్టిన కాల్ సెంటర్ కి 65 వేల కాల్స్ వచ్చాయని ఆయన చెప్పారు. రచ్చ బండ అప్లికేషన్స్ తో కలిపి మొత్తం 80 వేల మంది రైతుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు.