Revanth Reddy: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య మృతి పట్ల సీఎం సంతాపం

by Ramesh Goud |   ( Updated:2024-11-25 12:06:19.0  )
Revanth Reddy: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య మృతి పట్ల సీఎం సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే(Former Illandu MLA) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం(Condolences) ప్రకటించారు. గిరిజన నాయకులు(Tribal Leader), శాసనసభ మాజీ సభ్యులు ఊకే అబ్బయ్య(Uke Abbayya) మృతి(Death) పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం(Deep Sorrow) వ్యక్తంచేశారు. అబ్బయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అంతేగాక శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District)కు చెందిన ఊకే అబ్బయ్య ఉమ్మడి రాష్ట్రంలో బూర్గంపహాడ్ నియోజకవర్గం నుంచి ఒకసారి, ఇల్లందు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు అమూల్యమైన సేవలందించారని సీఎం గుర్తుచేసుకున్నారు. కాగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన మరణం పట్ల పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed