- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎక్కువగా ఫోన్ వాడితే.. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయా..?
దిశ, ఫీచర్స్: ప్రపంచంలో రోజు రోజుకి ఫోన్ ఎక్కువగా ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోతుంది. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ వాడుతూనే ఉంటారు. ఇవి మనిషి జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చిన్పపటికీ.. వాటిని ఎక్కువగా వాడుతున్నట్లైతే ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఇది తలనొపి, ఐ ప్రాబ్లమ్స్, నిద్రలేమి, వినిడికి, స్కిన్‌కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
* చాలామందికి రాత్రిళ్లు నిద్రపోయే సమయంలో ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. మరికొందరు లైట్ ఆఫ్ చేసిన తరువాత కూడా ఫోన్ చూస్తుంటారు. దీని కారణంగా కళ్ల చుట్టూ ముడతలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
* కొందరు ఫోన్ వాడేటప్పుడు ముఖానికి దగ్గరగా పెట్టుకుని చూస్తుంటారు. ఇలా ఎక్కువగా వాడేవారికి చర్మంపై దురద లేదా మంట వస్తుంది.
* ఎక్కువసేపు కాల్ మాట్లాడిన తరువాత ఫోన్ వేడిగా అవుతుంది. ఇలా జరగడం వల్ల స్కిన్‌లో మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. దీని వల్ల ఫేస్ మీద ఎక్కువగా డార్క్ స్పాట్స్ వస్తాయి.
* ఫోన్‌పై మన కంటికి కనిపించని రకరకాల సూక్ష్మక్రిములు దాగి ఉంటాయి. ఫోన్ మాట్లాడేటప్పుడు అవి స్కిన్‌పై చేరి చర్మానికి హాని కలిగిస్తాయి. అందువల్ల ఫోన్‌ని రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉండాలి.
* యూవీబీ, యూవీఏ లైట్‌తో పోలిస్తే, బ్లూ లైట్ అనేది స్కిన్‌పై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దీని వల్ల కళ్లు, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ఫోన్ మాడేటప్పుడు దాని బ్రైట్‌నెస్‌ని తగ్గించుకోవడం వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
* ఎక్కువగా ఫోన్ వాడుతున్నట్లైతే అది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్‌ని వెలువరిస్తాయి. ఈ రేడియోషన్‌లో పవర్, షార్ట్ రేంజ్‌లోనే ఉంటుంది. కానీ, లాంగ్ టర్మ్ ఎక్ప్సోజర్ వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీని వల్ల బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
ఇలా చేయండి?
* మొబైల్ వాడకుండా ఎవ్వరూ ఉండలేరు. దాని నుంచి మైండ్‌ని డైవర్ట్ చేయండి. ఎక్కువగా సమయం పుస్తకాలు చదవడం, గేమ్స్, గార్డెనింగ్, కుకింగ్ వంటివి చేస్తే మంచిది.
* నిద్రపోతున్న సమయంలో తల దగ్గర ఫోన్ ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఇది ఎక్కువ రేడియోషన్‌ని కలిగి ఉంటుంది. దీని వల్ల మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
* నిద్రపోయే సమయంలో ఎక్కువగా ఫోన్ చూడకండి. ఒకవేళ మీరు ఫోన్ చూడాలనుకుంటే రూమ్ లైట్ ఆన్ చేసుకొని, బ్రైట్‌నెస్‌ను తగ్గించుకుని వాడడం మంచిది.
* ఎక్కువ సమయం ఫోన్ మాట్లాడాల్సి వస్తే ఒకే చేతిలో ఉంచుకుని మాట్లాడకుండా చేయ్యి మారుస్తూ ఉండండి. లేదంటే మోచేతి నొప్పి ఎక్కువ అవుతుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.