KTR : దీక్షా దివస్‌లో కేసీఆర్ పాల్గొనటం లేదు.. కేటీఆర్ హాట్ కామెంట్స్

by Ramesh N |
KTR : దీక్షా దివస్‌లో కేసీఆర్ పాల్గొనటం లేదు.. కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నవంబర్ 29న 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ (Deeksha Divas) కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఈ దీక్షా దివస్‌లో కేసీఆర్ పాల్గొనటం లేదని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 2009 నవంబర్ 29 కేసీఆర్ (KCR) దీక్షతో తెలంగాణ ఉద్యమం మలపు తిరిగిందని అన్నారు. తెలంగాణపై కేసీఆర్ దీక్ష చెరగని ముద్ర వేసిందన్నారు.

ఈనెల 26న‌ అన్ని జిల్లా కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులను ఇంచార్జీలుగా నియమించామన్నారు. కేసీఆర్ విమరణ రోజు డిసెంబర్ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. దీక్షకు గుర్తుగా 29న నిమ్స్‌లో రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

(CM Revanth Reddy) రేవంత్ పాలనలో ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్ళీ వచ్చాయన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో కాంగ్రెస్ కబంధ హస్తాల తెలంగాణ ప్రజలను కాపాడుకుంటామన్నారు. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మెడలు వంచాలని విమర్శంచారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళతామన్నారు. అందుకే దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది.. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవటానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. 29 నవంబర్ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కదం తొక్కాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story