- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శ్రీ ఆత్మ సాక్షి సర్వేలో సంచలన ఫలితాలు.. తెలంగాణలో ఆ పార్టీదే అధికారం
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి తెలంగాణలో వివిధ సర్వేల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సంస్థలు సర్వేలు నిర్వహించిన ఫలితాలను విడుదల చేశాయి. ఇందులో కొన్ని సంస్థలు కాంగ్రెస్ కు అనుకూలంగా రిపోర్టులను ఇచ్చాయి. మరికొన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్ కు సపోర్ట్ గా రిపోర్టును ఇచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజల్లో పలు మార్పులు వచ్చాయి. ఈ తరుణంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై శ్రీ ఆత్మ సాక్షి సర్వే విడుదల చేసింది.
దీని ప్రకారం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. 64-70 స్థానాల్లో గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. అలాగే కాంగ్రెస్ పార్టీ 37-43 స్థానాల్లో గెలుస్తుందని తేల్చి చెప్పింది. అలాగే బీజేపీ 5-6 స్థానాల్లో ఎంఐఎం 6-7 స్థానల్లో గెలిచే అవకాశం ఉందని.. 6 స్థానాల్లో గట్టి పోటీ ఉండబోతుందని శ్రీ ఆత్మ సాక్షి సర్వే రిపోర్ట్ తెలిపింది. కాగా శ్రీ ఆత్మ సాక్షి గతంలో దుబ్బాక, హుజురాబాద్, నాగార్జున సాగర్, కర్ణాటక సర్వేలను సరిగ్గా అంచనా వేసింది.
ప్రధాన పార్టీల ఓట్ షేరింగ్..
బీఆర్ఎస్ : 42.5%
కాంగ్రెస్ : 36.5%
బీజేపీ : 10.75%
ఎంఐఎం : 2.75%
ఇతరులు : 7.5%