- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
టీఆర్ఎస్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన మాజీ మంత్రి వైఖరి
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతున్నది. వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేయబోయే అంశంపై నేతలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వ్యవహారం తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్టుండి ఆయన తన మాజీ పార్టీ విషయంలో సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. పార్టీ మారేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో సదరు నేత తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తిని రేపుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు తప్పవా అనే చర్చ తెరపైకి వస్తోంది. ఆధికార టీఆర్ఎస్ పార్టీలో ఖమ్మం నేతల అంశంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపగలిగే నాయకుల్లో అనేకమంది ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. దాంతో ఈ జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గా సాగుతుంది.
తాజాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తిరిగి పాత గూటికి చేరబోతున్నారా అనే గుసగుసలు ఖమ్మం టీఆర్ఎస్ లో గుప్పుమంటున్నాయి. 2014 వరకు టీడీపీలోనే కొనసాగిన తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శక్తివంతమైన లీడర్ గా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి కారెక్కారు. ఈ క్రమంలో వచ్చిన ఉప ఎన్నికలో గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తుమ్మల ఓటమి పాలు కావడం, కాంగ్రెస్ తరపున పోటీ చేసి తనను ఓడించిన కందాల ఉపేందర్ రెడ్డి తిరిగి టీఆర్ఎస్ లో చేరడంతో తుమ్మల వర్గం కొంత అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఆ తర్వాత తనను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి కేసీఆర్ ఆదరిస్తారని ఆశించినా ఆ మేరకు కేసీఆర్ నుంచి సానుకూల నిర్ణయాలేవి రాకపోవడం, తన ఓటమికి కారణం అయిన వ్యక్తి తిరిగి తన పార్టీలోనే చేరడంతో ఈ విషయం తుమ్మలకు మింగుడు పడటం లేదని, అందువల్లే ఆయన టీఆర్ఎస్ తో పాటు రాజకీయంగా కాస్త అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపించింది. దీంతో ఆయన పార్టీ మారుతారనే చర్చ గత కొంత కాలంగా జోరుగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఇటీవల గోదావరి నదికి వరదలు వచ్చిన సందర్భంలో సీఎం కేసీఆర్ పర్యటనలో తుమ్మల నాగేశ్వర్ రావు పేరు మరోసారి మార్మోగింది. తుమ్మల కృషిని కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తిన తీరుతో గులాబీ పార్టీలో చర్చగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఆయన్ను తిరిగి టీడీపీలో చేరిపోవాలనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల నుంచి ఆయనకు అందినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలు జరిగాయి. ఇందులో తుమ్మల నాగేశ్వరరావు సైతం పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు సైతం భారీగా హాజరయ్యాయి. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ధైవంగా భావించే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహణకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని తుమ్మల కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ దయతోనే నాగార్జున సాగర్, కృష్ణా జాలాలు తీసుకు వచ్చామని, దేవుడి లాంటి ఎన్టీఆర్ ఈ కాలువకు అనుమతి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. గోదావరి వరి జాలాల నీరు అందాలనేది తన జన్మ కోరిక అని అది కూడా సీతారామ ప్రాజెక్టు ద్వారా తీసుకువస్తామన్నారు. రెండు జిల్లాల భవిష్యత్తు కోసం పచ్చగా పంటలు పండాలనే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరానని చెప్పుకువచ్చారు.
అయితే ఈ సందర్భంగా కొంతమంది టీడీపీ నేతలు తుమ్మలను తిరిగి టీడీపీలో చేరాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. 2018 ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్రమంతటా ఎదురు గాలి వీచినా ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలు దక్కాయి. టీడీపీకి ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది. త్వరలో చంద్రబాబు సైతం ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెడతానని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో తుమ్మల హాజరు కావడం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. గతంలో ఏక్షణంలోనైనా పిడుగులాంటి వార్తలు వినొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేసిన తుమ్మల మాటలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. దీంతో ఇప్పుడీ వ్యవహారం పాలేరు టీఆర్ఎస్ లో చర్చగా మారింది. మరి తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.