పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అదంతా కామన్ అని కొట్టిపడేశారు. ఎన్నికల్లో గెలిచిన నేతలు ఫిరాయింపులకు పాల్పడటం బీఆర్ఎస్(BRS) హయాం నుండి జరుగుతూ వస్తున్నదే అన్నారు. కొత్తగా జరిగితే ఆశ్చర్యపోవాలి, చర్చించాలి గాని ఎప్పటి నుండో జరుగుతున్న వ్యవహారానికి అంత ప్రాముఖ్యం ఇవ్వాల్సిన పని లేదని స్పీకర్ వ్యాఖ్యానించారు. కాగా బీఆర్ఎస్ పార్టీ బీ-ఫామ్ మీద గెలిచి, కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకోవాలని గులాబి నేతలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై స్పందించిన తెలంగాణ హైకోర్ట్ ఫిరాయింపు నేతలపై వేటు వేయాలని, లేదంటే మేమే సుమోటోగా తీసుకొని, రంగలోకి దిగాల్సి ఉంటుందని అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కోర్టు తీర్పు అనుగుణంగా.. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటార లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Next Story