Speaker: న్యూఇయర్ వేడుకలు రద్దు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2024-12-31 15:57:08.0  )
Speaker: న్యూఇయర్ వేడుకలు రద్దు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: నూతన సంవత్సర వేడులకు దూరంగా ఉంటున్నానని, తెలంగాణ బిడ్డలుగా ఇది మన బాధ్యత అని తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) పిలుపునిచ్చారు. న్యూఇయర్ వేళ.. నూతన సంవత్సర వేడుకలు(New Year celebrations) రద్దు(canceled) అని ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. భారత మాజీ ప్రధానమంత్రి(Former Prime Minister) స్వర్గీయ మన్మోహన్ సింగ్(Manmohan Singh) స్ముత్యర్ధం వారం రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నందున నూతన సంవత్సర వేడుకలకు(celebrations) దూరంగా(staying away) ఉంటున్నానని తెలిపారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మన్మోహన్ సింగ్ కి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలది అని, జనవరి 3వ తేదీ వరకు సంతాప దినాలు(mourning periods) ఉన్నందున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు దూరంగా ఉంటున్నానని అన్నారు. ఇక రేపు (జనవరి 1, 2025న) వికారాబాద్ నియోజకవర్గ(Vikarabad constituency), జిల్లా ప్రజలు ఎవ్వరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి నివాసానికి రావద్దని, తాను కూడా అందుబాటులో ఉండడం లేదని స్పీకర్ చెప్పారు.

Advertisement

Next Story