చైనా మాంజా అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు

by Sridhar Babu |
చైనా మాంజా అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు
X

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల జిల్లా పరిధిలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరిం చారు. జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా మాంజా అమ్మేవారితోపాటు వినియోగించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. చైనా మంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందని అవగాహన కలిగి ఉండాలని అన్నారు. చైనా మాంజా రవాణా, విక్రయాలపై స్థానిక పీఎస్ లలో కానీ లేదా డయల్ 100 కానీ ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Next Story