- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శివ ధ్యానంలో గిజిగాడు! మహాశివరాత్రి పర్వదిన విచిత్ర ఘటన
దిశ, డైనమిక్ బ్యూరో: సాధరణంగా పిచ్చుకలు ఇళ్లలోకి వచ్చి పప్పులు, గింజలు లాంటి పదార్థాలు తింటూ ఉంటాయి. మనం ఆ పిచ్చుక దగ్గరికి వెళితే ఆవి తుర్రుమని ఎగిరిపోతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అందుకు భిన్నంగా ఓ విచిత్ర సంఘటన జరిగింది. మహాశివరాత్రి పర్వదిన ఓ పిచ్చుక వచ్చి పూజ మందిరం లోకి వెళ్లి కదలకుండా అక్కడే కూర్చుని ధ్యానం చేస్తుందని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా ధర్మపురి లోని ఓ ఇంట్లోకి పిచ్చుక వచ్చింది.
ఆ పిచ్చుక నేరుగా ఇంటి ప్రధాన ద్వారం గుండా పూజామందిరంలో వచ్చి హారతి పళ్లెం వాలింది. చాలా సమయం వరకు కదలకుండా అక్కడే కూర్చున్నట్లు వీడియోలో కన్పిస్తుంది. అయితే ఆ పిచ్చుక పూజ మందిరంలో శివుని ధ్యానం చేస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు స్పందిచారు. హౌస్ స్పారోస్ చాలా ఫ్రెండ్లీ బర్డ్స్ అని ఇళ్లలోకి తరుచుగా వస్తుంటాయని, పూజ, ధ్యానం చేయడం ఏమిటని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.