GST scam case: మాజీ సీఎస్ సోమేశ్ కు నోటీసులకు రంగం సిద్ధం!

by Prasad Jukanti |
GST scam case: మాజీ సీఎస్ సోమేశ్ కు నోటీసులకు రంగం సిద్ధం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న జీఎస్టీ కుంభకోణంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్న మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. సోమేశ్ కుమార్ తో పాటు మరికొందరు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ లో రూ. 1000 కోట్ల స్కామ్ జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో వెల్లడైంది. మాజీ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి లేఖలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వాణిజ్య పన్నుల శాఖకు అప్పట్లో కమిషనర్ గా వ్యవహరించిన సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే హైదరాబాద్ ఐఐటీ రూపొందించిన సాఫ్ట్ వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు పక్కదారి పట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో సోమేశ్ తో సహా మొత్తం ఐదుగురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కుంభకోణంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో నిందితులకు త్వరలోనే నోటీసులు ఇచ్చి వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed