‘త్వరలోనే మహిళలకు రూ.2500 ఇవ్వబోతున్నాం’

by Rajesh |
‘త్వరలోనే మహిళలకు రూ.2500 ఇవ్వబోతున్నాం’
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళలను ఆర్ధికంగా శక్తివంతులుగా చేయబోతున్నామని ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..త్వరలోనే 2500 ఇవ్వబోతున్నామన్నారు. నియోజకవర్గంలో 3500 ఇళ్లు చొప్పున అందజేస్తామన్నారు. ఉద్యమ సమయంలో విద్యార్థులను ఉసిగొల్పి కేసీఆర్ కుటుంబం అధికారాన్ని సంపాదించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారన్నారు. చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో కేటీఆర్, కేసీఆర్ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిజమైన విద్యార్థులు లైబ్రరీలో చదువుతున్నారని, బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు అమాయక విద్యార్థులను రెచ్చగొడుతున్నారన్నారు. కవితను జైలు నుంచి విడిపించుకోవడం కోసం బీజేపీ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్‌ను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు.

ప్రజాపాలనను జీర్ణించుకోలేక కడుపు మంటతో రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం విద్యార్థులను కేసుల పాలు చేస్తోందన్నారు. కేసీఆర్ ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసి ఆంధ్రా కాంట్రాక్టర్లను పెంచి పోషించారన్నారు. గ్రూప్ 1 పరీక్ష పైన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ నే ఈ ప్రభుత్వం కొనసాగించిందన్నారు. డీఎస్సీ పరీక్ష జరిగితే తమ పార్టీ మనుగడ కష్టమౌతుందనే రాద్దాంతం చేయిస్తున్నారని వెల్లడించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ చిల్లర దొంగ అని విమర్శించారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన సంస్కార హీనమైన మాటలు మాట్లాడాన్నారు. గాదరి కిషోర్‌ను చెప్పుతో కొట్టాలన్నారు. ఆయన స్థాయి, బతుకు తెలుసుకోకుండా సీఎంను విమర్శించడం సరికాదన్నారు. కిషోర్‌కు సంస్కారం లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed