- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలయ్య షోలో గ్లోబల్‌స్టార్.. ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రమోషన్స్ అక్కడే.. మామూలు ప్లాన్ చేయలేదుగా..?
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’. ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేసుకుంది. అయితే నేటి నుంచి సీజన్4 మొదలు కానుంది. శుక్రవారం రాత్రి మొదటి ఎపిసోడ్ సీఎం చంద్రబాబు నాయుడుతో స్ట్రీమింగ్ కానుంది. దీంతో అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు టీడీపీ కార్యకర్తలు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పటికే అన్‌స్టాపబుల్ పలు ఎపిసోడ్స్ ఆల్రెడీ షూటింగ్ అయ్యాయి. ఇందులో భాగంగా నాగార్జున, అల్లు అర్జున్, సూర్య ఎపిసోడ్స్ షూటింగ్ అయినట్టు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం వచ్చే వారం రామ్ చరణ్ ఈ షోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా గ్లోబల్ స్టార్, దిల్ రాజు ఇద్దరూ కలిసి అన్‌స్టాపబుల్ షోకి వస్తున్నారట.
ఇక ఇటీవలే ‘గేమ్ ఛేంజర్’ సినిమాని సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా బాలయ్యతో – రామ్ చరణ్ ఎపిసోడ్ షూట్ చేసి సినిమా రిలీజ్‌కి ముందు వదులుతారని తెలుస్తుంది. దీంతో రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వాని హీరోయిన్‌గా సన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీను తెరకెక్కిస్తున్నారు.