- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నీటిని వదలకుండా.. అందులో రక్తం పారుతుంది పాక్ వార్నింగ్

దిశ, వెబ్ డెస్క్: కశ్మీర్ లోని పహల్గామ్(Pahalgam)లో ఉగ్రవాదులు టూరిస్టులపై అతి కిరాతంగా కాల్పులు జరిపి 28 మందిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో యావత్ భారత దేశం ఉలిక్కిపడటం తో పాటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కశ్మీర్ కొండల్లో శాంతి నెలకొనడం ఇష్టంలేని పాక్.. ఈ దుశ్చర్యలకు కారణం అయినట్లు గుర్తించిన భారత్.. సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పాక్ పౌరులను భారత్ విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఇండస్ (సిందూ) నదీ జలాల నుంచి ఇకపై ఒక్క చుక్క కూడా నీటిని వదిలిపెట్టే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగానే వెంటనే ఆ నదిపై ఉన్న డ్యాం గేట్లను మూసివేసింది. దీంతో ఆగ్రహించిన పాకిస్తాన్ అధికారి.. భారత్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.
అలాగే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో (Bilawal Bhutto) ఈ ఈ అంశంపై మాట్లాడుతూ.. భారత్ ను రెచ్చగొట్టే విధంగా హెచ్చరికలు జారీ చేసాడు. పహల్గామ్ దుర్ఘటనకు పాకిస్తాన్ ను దోషిగా చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే భారత్ తన నిస్సహాయతను కప్పిపుచ్చుకోవడానికి పాక్ ను నిందిస్తున్నారని ఆరోపించారు. అకారణంగా సింధు నదీ జలాలను పాక్ కు రాకుండా నిలిపివేశారని.. ఆ నది పాకిస్థాన్ కు చెందిందని అన్నారు. మా నదిలో నీళ్లను వెంటనే విడుదల చేయాలని.. లేకపోతే.. సింధు నది (Indus River)లో నీరు లేకపోతే భారతీయులు రక్తం పారుతుందని.. సుక్కూర్ సభలో భుట్టో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించారు. దీంతో అతని వ్యాఖ్యలపై భారత ప్రజలతో పాటు ఇతర దేశాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.