IND vs NZ, 2nd Test: మళ్లీ ఆలౌట్ అయిన భారత్

by Mahesh |   ( Updated:2024-10-25 07:48:33.0  )
IND vs NZ, 2nd Test: మళ్లీ ఆలౌట్ అయిన భారత్
X

దిశ, వెబ్ డెస్: పుణె వేదికగా IND vs NZ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్(first innings) లో న్యూజిలాండ్( New Zealand) జట్టును 259 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్(India).. మరోసారి మొదటి ఇన్నింగ్స్‌లోనే కుప్పకూలిపోయింది. మొదటి సెషన్ లోనే ఏకంగా 6 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత జడేజా కొద్ది సేపు మెరుపులు మెరిపించి 38 పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వచ్చినవారు వచ్చినట్లే వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో భారత్ రెండో రోజు లంచ్ సమయం ముగిసిన తర్వాత కొద్ది సేపటికే ఆలౌట్(All Out) అయింది. మొదటి ఇన్నింగ్స్ లో మొత్తం 45.3 ఓవర్లు ఆడిన భారత జట్టు 156 పరుగులకు ఆలౌట్ అయ్యారు. అందులో జైస్వాల్ 30, గిల్ 30, పంత్ 18, జడేజా 38, సుందర్ 18 పరుగులు మినహా ఎవరూ సరిగ్గా రాణించలేదు. అలాగే న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్(Mitchell Santner) 7 వికెట్లు తీసుకోగా గ్లేన్ ఫలిప్స్ 2, సౌథీ 1 వికెట్ పడగొట్టారు. దీంతో న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 103 పరుగుల లీడ్‌లో నిలిచింది.

Advertisement

Next Story