రోడ్డు ప్రమాదంతో.. వెలుగులోకి గోవుల అక్రమ రవాణా

by Aamani |
రోడ్డు ప్రమాదంతో.. వెలుగులోకి గోవుల అక్రమ రవాణా
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): గోవులను హైదరాబాద్ కు తరలిస్తున్న డీసీఎం ప్రమాదానికి గురికావడంతో గోవుల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కు సుమారు 75 గోవులను డీసీఎం వాహనంలో 365 ఏ రహదారిపై తరలిస్తున్నారు. మార్గమధ్యలో అర్వపల్లి లో రోడ్డు పక్కన ఆపిన ఖాళీ ఇసుక లారీని ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో గోవుల డీసీఎం డ్రైవర్ సీట్, స్టీరింగ్ మధ్యలో ఇరుక్కోవడంతో స్థానికులు రక్షించి, సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా డీసీఎం ను తనిఖీ చేయగా గోవులను బంధించి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వెలుగు చూసింది. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే ఢీకొట్టిన ఇసుక లారీలోనే సుమారు 60 గోవులను హైదరాబాద్ లోని జియాగూడ గోశాలకు తరలించి, గాయాలపాలైన మిగతా 13 గోవులను స్థానిక పూజారి గోశాలకు తరలించినట్లు తెలుస్తోంది. అనంతరం డీసీఎంను, ఇద్దరు బీహార్ కూలీలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. కేసు నమోదు తదితర పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed