హైడ్రా తోక ముడవడానికి కారణమిదే.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
హైడ్రా తోక ముడవడానికి కారణమిదే.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ(BJP) ఆందోళనలతోనే హైడ్రా(Hydraa) తోక ముడిచిందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) అన్నారు. శుక్రవారం తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, బాధితులకు అండగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఈటల మాట్లాడుతూ.. అబద్ధాలకు మారుపేరు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయకపోతే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వబోమని బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన జరగాలి.. కానీ, ఇలా బలవంతంగా మరో ప్రాంత ప్రజలను రోడ్డున లపడేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇక నుంచి ఒక్క ఇళ్లు కూల్చిన ఊరుకోము అని హెచ్చరించారు. అనంతరం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తమతో కలిసి మూసీ ప్రాంత పరిశీలనకు రావాలని సూచించారు. మూసీ ప్రక్షాళనకు అక్కడున్న ప్రజలు ఒక్కరు ఒప్పుకున్నా తాము తగ్గి.. ప్రభుత్వానికి సహకరిస్తామని అన్నారు. మీ లీడర్ల కమీషన్‌ల కోసం సామాన్య ప్రజలను రోడ్డున పడేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము అని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story