వరద బాధితులకు గుడ్ న్యూస్.. మరో రూ.2.5 కోట్లు విడుదల

by srinivas |   ( Updated:2024-10-25 10:38:45.0  )
వరద బాధితులకు గుడ్ న్యూస్.. మరో రూ.2.5 కోట్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ వరద బాధితుల(Vijayawada flood victims)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మరో రూ.2.5 కోట్ల పరిహారం (Compensation)విడుదల చేసింది. 1,501 మంది వరద బాధితుల అకౌంట్లకు నగదు బదిలీ చేసింది. అయితే వీరిలో143 మంది లబ్ధిదారుల అకౌంట్‌లో పరిహారం జమ కాలేదని గుర్తించారు. బాధితుల బ్యాంకు వివరాలు మరోసారి తీసుకుని పరిహారం వారి అకౌంట్లలోకి విడుదల చేయనుంది.

కాగా బుడమేరు వాగు పొంగడంతో విజయవాడలోని పలు కాలనీలు, బస్తీలు మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే బాధితులు సర్వం కోల్పోవడంతో వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. ముందుగా కొంతమంది వరద బాధితులకు పరిహారం అందజేశారు. ఇప్పుడు మరోసారి కూడా పరిహారం విడుదల చేశారు. అయినా ఇంకొంత మందికి పరిహారం అందకపోవడంతో మరో బ్యాంకు వివరాలు సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. వరద బాధితులకు అండగా ఉంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed