- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు బైకు దొంగల అరెస్ట్..పరారీలో ఒకరు
దిశ, కార్వాన్ : జల్సాలకు అలవాటు పడి బైకు దొంగతనాలు చేస్తున్న ఇద్దరు చిన్ననాటి స్నేహితులు అరెస్ట్ అయిన ఘటన మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ మహేష్ కథనం ప్రకారం.. ముషీరాబాద్ బొలక్ పూర్ కి చెందిన మహమ్మద్ కరీం(19)సర్వర్ మియా(19)మహమ్మద్ కాజా ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. వీరు ముగ్గురు ముషీరాబాద్ లోని బోలక్ పూర్ లో స్క్రాప్ వర్క్ చేస్తారు. కాగా వీరు ముగ్గురు బోలక్ పూర్ వద్ద ఉన్న కట్ని హోటల్ లో మద్యం సేవించేవారు. వారికి వచ్చే ఆదాయం విలాసవంతమైన ఖర్చులకు సరిపోక రోడ్డుపై పార్కింగ్ చేసి ఉన్న బైకులను దొంగతనం చేసి పాట్లుగా విడగొట్టి అమ్మేందుకు పథకం వేశారు. కాగా ఎస్సై రాజు తన సిబ్బందితో కలిసి బోయ గూడా కమాన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కరీం,సర్వర్ మియా బైక్ వస్తుండగా వారిని ఆపి అడగగా పొంతన లేని సమాధానం చెప్పారు. అనుమానం వచ్చి పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా 3 బైకులు దొంగతనం చేసినట్లు తేలింది. కరీం,సర్వర్ ను రిమాండ్ కు తరలించగా మహమ్మద్ కాజా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.