- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: రోశయ్యను ఎదిరించి మండలిలో మాట్లాడా.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సమస్యలపై ప్రతిపక్షంలో ఓ ఎమ్మెల్సీగా తాను శాసన మండలిలో కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) ఎదిరించి మాట్లాడానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లోని హైటెక్స్ (Hitex) ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోణిజేటి రోశయ్య వర్థంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యక్ష రాజకీయాల్లో రోశయ్య (Rosaiah) సూచనలతో రాజకీయాలపై తాను అవగాహన పెంచుకున్నానని అన్నారు. ఆయనను ఎదిరిస్తూ తాను శాసనమండలిలో మాట్లాడానని గుర్తు చేశారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందంటే రోశయ్య (Rosaiah)16 ఏళ్లు ఆర్థిక మంత్రిగా పని చేయడమే కారణమని పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రోశయ్య తనకు చెప్పేవారని సీఎం అన్నారు. ఆయన సూచనలతోనే రాజకీయాలపై అవగాహన పెంచుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రులు ధీమాగా అన్ని సంవత్సరాలు పాలించారంటే రోశయ్య (Rosaiah) ఆర్థిక మంత్రిగా ఉండటం ఓ కారణమని అన్నారు. రాష్ట్రానికి సీఎంగా ఎవరున్నా.. రోశయ్యకు నెంబర్ 2 పొజిషన్ పర్మినెంట్‌గా ఉండేదని అన్నారు. తనకు పదవి కావాలని ఎవరినీ ఏనాడు ఆయన అడగలేదని తెలిపారు. ఆయనకు ఉన్న ప్రతిభ, క్రమశిక్షణే వల్లే వివిధ హోదాలు దక్కాయని సీఎం అన్నారు. చట్టసభల్లో రోశయ్య బలమైన ముద్ర వేశారని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక రంగంలో రాణించాలంటే ఆర్యవైశ్యుల పాత్ర ప్రముఖమని, త్వరలోనే హైదరాబాద్ (Hyderabad)లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.