Nithyananda Roy: కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైనే ఉద్యోగ ఖాళీలు: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-04 16:40:07.0  )
Nithyananda Roy: కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైనే ఉద్యోగ ఖాళీలు: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
X

దిశ, వెబ్‌‌డెస్క్: కేంద్ర సాయుధ బలగాలు(CAPF), అస్సాం రైఫిల్స్(AR)లో అక్టోబర్ 30 నాటికి 1,00,204 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్(Nithyananda Roy) రాజ్యసభ(Rajya Sabha)లో లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. వీటిలో అత్యధికంగా సీఆర్పీఎఫ్(CRPF)లో 33,730, సీఐఎస్ఎఫ్(CISF)లో 31,782, బీఎస్ఎఫ్(BSF)లో 12,808, ఐటిబీపీ(ITBP)లో 9,861, ఎస్ఎస్బీ(SSB)లో 8,646, అస్సాం రైఫిల్స్(AR)లో 3377 చొప్పున ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. యూపీఎస్సీ(UPSC), ఎస్ఎస్సీ(SSC) ద్వారా త్వరలో ఈ ఖాళీలను భర్తీ చేస్తామని, అలాగే గడిచిన ఐదు ఏళ్లలో వివిధ విభాగాల్లో మొత్తం 71,231 పోస్టులను భర్తీ చేశామని వెల్లడించారు . ఈ నియామక ప్రక్రియలను వేగవంతం చేసేందుకు మెడికల్ టెస్ట్(Medical Test)లకు సంబంధించి టైంను తగ్గించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే కేంద్ర బలగాల్లో ఉద్యోగం చేసే వారికి ఏడాదికి 100 డేస్ హాలిడేస్(Holidays) ఇస్తున్నామని రాయ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed