BJP: దమ్ముంటే రాజీనామా చెయ్.. మంత్రి కోమట్టి రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే సవాల్

by Ramesh Goud |
BJP: దమ్ముంటే రాజీనామా చెయ్.. మంత్రి కోమట్టి రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) మధ్యాహ్నం తాగి మతిస్థిమితం లేకుండా మాట్లాడతాడని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే(Armur BJP MLA) పైడి రాకేష్ రెడ్డి(Paidi Rakesh Reddy) ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిజామాబాద్(Nijamabad) పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మద్యం తాగే కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడని విమర్శలు చేశారు.

rగెలిచిన వ్యక్తిని కాదని ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే అని పరిచయం చేస్తారా? అంటూ.. డబ్బు, అహంకారం ఉంటే నీ దగ్గరే పెట్టుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ తెలంగాణ(South Telangana) నుంచి వచ్చి ఉత్తర తెలంగాణ(North Telangana)పై పిచ్చి వాగుడు వాగుతున్నారని, కోమటిరెడ్డి అనే పేరు వల్ల బతికిపోయాడని, లేకుంటే ఆయన సంగతి తేల్చేవాడినని హెచ్చరించారు. అంతేగాక నాలుగు సార్లు గెలిచిన అని గొప్పలు చెప్పుకునే వ్యక్తికి ఎలా మట్లాడాలో తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కోమటిరెడ్డి దమ్ముంటే నల్లగొండ(Nalgonda)లో రాజీనామా(Resign) చేయాలని, తాను నిజామాబాద్ జిల్లాలో రాజీనామా చేస్తానని, ఇద్దరం పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం అని రాకేష్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed