Minister Satya Prasad : రెవెన్యూ సదస్సులకు సన్నద్ధంకండి : మంత్రి అనగాని సత్య ప్రసాద్

by Y. Venkata Narasimha Reddy |
Minister Satya Prasad : రెవెన్యూ సదస్సులకు సన్నద్ధంకండి : మంత్రి అనగాని సత్య ప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రం(AP)లో ఈనెల 6 నుండి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల(Revenue Conferences)కు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్(Satya Prasad)ఆదేశించారు. మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో అనగాని సత్య ప్రసాద్ రెవెన్యూ సదస్సుల సన్నాహాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సిన విధానాలపై కలెక్టర్లకు మంత్రి సత్యప్రసాద్ పలు సూచనలు ఇచ్చారు. అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు.

భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా రెవెన్యూ సదస్సులు జరగాలని మంత్రి అనగాని స్పష్టం చేశారు. భూ దందాలపై కూటమి ప్రభుత్వానికి దాదాపు 10 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈనెల ఆరో తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చని అన్నారు. భూదందాలపై ఉక్కు పాదం మోపాలన్నారు. ఇప్పటికే భూదురాక్రమణ (నిరోధక) చట్టం 2024ను తీసుకొచ్చామని గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed