- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UN: ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఓటేసిన భారత్
దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో( UN General Assembly) ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా భారత్(India) ఓటేసింది. పాలస్తీనా భూభాగాన్ని(Palestinian territory ) ఇజ్రాయెల్(Israel) దళాలు వీడాలని యూఎన్(UN) జనరల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. 1967 నుంచి తూర్పు జెరూసలెం సహా పలు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించడంపై శాంతియుత పరిష్కారం కోరుతూ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై యూఎన్ లో ఓటింగ్ జరిగింది. కాగా, దీనికి అనుకూలంగా భారత్‌తో సహా 157 దేశాలు ఓటు వేశాయి. అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా సహా ఇతర 8 దేశాలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. కాగా ఉక్రెయిన్, ఉరుగ్వే, పరాగ్వే, జార్జియా, ఈక్వెడార్, చెకియా, కామెరూన్ వంటి దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని.. శాశ్వత శాంతిని నెలకొల్పాలని యూఎన్ ఓటింగ్ లో భారత్ నొక్కి చెప్పింది. ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో సైనిక దాడులు, హింసాత్మక చర్యలను తక్షణమే నిలివేయాలని యూఎన్ తీర్మానం స్పష్టం చేసింది. ఆ ప్రాంతాల నుంచి వైదొలగాలని ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేసింది.
పాలస్తీనా- ఇజ్రాయెల్ ఘర్షణలు
పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య సరిహద్దుల విషయంలో ఘర్షణలు చెలరేగాయి. దీంతో 57ఏళ్ల క్రితం నుంచి ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న తమ భూభాగాలను తిరిగి అప్పగించి ప్రత్యేక దేశంగా పాలస్తీనాను ఏర్పాటుచేయాలని ఆ దేశం కోరుతోంది. కాగా ప్రస్తుతం ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తమ భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం చట్ట విరుద్ధమని ప్రకటించాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాలస్తీనా ఆశ్రయించింది. ఈ పరిణామాల మధ్యే పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ దళాలు వీడాలంటూ ఐక్యరాజ్య సమితి (UN) సర్వసభ్య సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు.