Devendra Fadnavis : సీఎం అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత ఫడ్నవీస్ తొలి స్పీచ్

by Mahesh |   ( Updated:2024-12-04 14:17:17.0  )
Devendra Fadnavis : సీఎం అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత ఫడ్నవీస్ తొలి స్పీచ్
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా యుతి కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కాబోయే సీఎం ఎవరనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 122 సీట్లు సాధించిన బీజేపీ(BJP) పార్టీ కూటమిలో అత్యధిక స్థానాలు సాధించింది. దీంతో ఆ పార్టీకే సీఎం పదవి దక్కుతుందని ముందు నుంచి వచ్చిన వార్తలను నిజం చేస్తూ.. ఈ రోజు మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.

తనను మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న అనంతరం.. దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఇలా అన్నారు. "మీరందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శాసనసభా పక్షం నుండి అందరికీ ధన్యవాదాలు. మా కేంద్ర పరిశీలకులు విజయ్ రూపానీ, నిర్మలా సీతారామన్‌లకు కూడా ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు.. ఇవి చారిత్రాత్మక ఎన్నికలు. ఈ ఎన్నికలు 'ఏక్ హై తో సేఫ్ హై' - 'మోదీ హై తో ముమ్కిన్' అని నిరూపించాయి. హర్యానాతో మేము మా విజయాల పరంపరను పునఃప్రారంభించాము. ఇప్పుడు మహారాష్ట్ర ఓటర్ల ముందు నేను పూర్తిగా నమస్కరిస్తున్నాను. మా ఇతర మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని చెప్పుకొచ్చారు. కాగా రేపు ముంబై ఆజాద్‌ మైదానంలో సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణస్వీకారం కోసం ఏర్పాటు చేస్తుండగా.. ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు ఎన్డీయే మిత్రపక్షాల సీఎంలకు ఆహ్వానం పంపారు.

Advertisement

Next Story

Most Viewed