- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి శ్రీధర్ బాబు జిల్లాకు భారీగా కేటాయింపులు
దిశ, తెలంగాణ బ్యూరో: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 50 బెడ్ల హాస్పిటల్‌ను, వంద బెడ్లకు అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం రూ.51 కోట్లు కేటాయించారు. దీంతో పాటు పెద్దపల్లి జిల్లా మంథనిలో 50 బెడ్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అదే జిల్లా గుంజపడుగు లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ఈ రెండు హాస్పిటళ్లకు కలిపి సుమారు రూ.25 కోట్లు కేటాయించారు. ఈ హాస్పిటళ్లతో పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
బుధవారం పెద్దపల్లి లో జరిగే ప్రజా ప్రభుత్వ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఈ హాస్పిటళ్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఇటీవలే మంచిర్యాలలో 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి దామోదర రాజ నర్సింహ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అదే ప్రాంతానికి మరో మూడు హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తుండడంతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాలు, డిస్టెన్స్ ను బట్టి హాస్పిటల్స్ ను ఏర్పాటు చేస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.