Viral News : వైరల్ అవుతున్న 'బనానా టేప్'.. చివరికి ఏం జరిగిందంటే?

by M.Rajitha |
Viral News : వైరల్ అవుతున్న బనానా టేప్.. చివరికి ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచంలో ట్రెండింగ్ లో ఉన్న వార్తల్లో ‘బనానా టేప్‌’ (Taped Banana) ఒకటి. అందుకు కారణంగా టేప్‌ వేసిన అరటిపండు కళ్లు చెదిరే ధర పలకడమే. ఇటీవలే న్యూయార్క్‌(NewYark)లో జరిగిన వేలంలో ఒక అరటిపండుకు కోట్లల్లో ధర పలికిన విషయం తెలిసిందే. గోడకు టేపుతో అతికించి ఉన్న ఆ అరటిపండును చైనా పారిశ్రామికవేత్త జస్టిన్‌ సన్‌(Justin Son) 6.24 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.52.7 కోట్లు)కు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, కొన్న తర్వాత ఆ అరటిపండును సెకన్ల వ్యవధిలోనే అతను తినేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

ఇటలీ విజువల్‌ ఆర్టిస్ట్‌ మౌరిజియో కాటెలన్‌ 2019లో దీనిని సృష్టించాడు. గోడపై ఒక అరటిపండుకు టేప్‌ వేసి అతికించడం మినహా దీంట్లో ప్రత్యేకతేమీ లేదు. ఈ అరటిపండుకు ‘కమెడియన్‌’(Comedian) అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఈ 'బనానా టేప్' వార్తల్లో నిలుస్తోంది. ‘కమెడియన్‌’ పేరిట చేసిన ఈ అరటి పండు ఆర్ట్‌వర్క్‌ను మియామి బీచ్‌ ఆర్ట్‌ బాసెల్‌లో తొలిసారి ప్రదర్శించారు. ఇది ఐదేళ్ల క్రితం రూ. 98 లక్షలతో అమ్ముడుపోయింది. ఆ తర్వాత కూడా ఇదే ధరకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత కాటెలన్‌ దీని ధరను పెంచారు. తాజా వేలంలో ఇది ఏకంగా 6.2 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

Advertisement

Next Story

Most Viewed