MLC జీవన్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ కీలక హామీ

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-25 10:30:58.0  )
MLC జీవన్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy)తో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్(Madhu Yaskhi Goud) భేటీ అయ్యారు. ఆయన ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మధుయాష్కీ(Madhu Yaskhi Goud) మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) ఎంతో కృషి చేశారని అన్నారు. జీవన్ రెడ్డి సేవలు పార్టీకి ఇప్పుడే కాదు.. ఎప్పటికీ అవసరమే అని చెప్పారు. ప్రభుత్వ పాలనపై తెలిపిన అభ్యంతరాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి మధుయాష్కీ హామీ ఇచ్చారు. కాగా ఇటీవలే మధుయాష్కీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా గంగారెడ్డి హత్య నేపథ్యంలో జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో ప్రస్తుతం వీరిద్దరు భేటీ కావడం.. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని మధుయాష్కీ హామీ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీనిపై ప్రభుత్వం పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉండగా.. తన అనుచరుడు గంగారెడ్డి హత్య వెనుక స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హస్తం ఉందని జీవన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story