Rana Daggubati: అరుదైన ఘనత సాధించిన తెలుగు సినిమా ‘35 చిన్న కథ కాదు’.. రానా పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-10-25 15:07:38.0  )
Rana Daggubati: అరుదైన ఘనత సాధించిన తెలుగు సినిమా ‘35 చిన్న కథ కాదు’.. రానా పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నివేదా థామస్(Niveda Thomas), ప్రియదర్శి జంటగా నటించిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’(35-Chinna Katha Kaadu). నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించగా.. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రానా దగ్గుబాటి(Rana Daggubati ) సమర్పణలో సృజన్ యరబోలు, సిద్దార్థ్ నిర్మించారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 6న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను కూడా మెప్పించింది. తాజాగా, ‘35 చిన్న కథ కాదు’ (35-Chinna Katha Kaadu)ఓ అరుదైన ఘనత సాధించింది. 2024 ప్రేస్టిజీయస్ అవార్డ్స్ 55వ ఐఎఫ్ఎఫ్‌కు ఇండియన్ పనోరమ(Indian Panorama) ఎంపిక చేసినట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

అంటే గోవాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో దీనిని ప్రదర్శించనున్నారు. అయితే దీని కోసం 384 చిత్రాలు ఎంట్రీ చేయగా.. తెలుగు నుంచి ‘35 చిన్న కథ కాదు’(35-Chinna Katha Kaadu) ఎంపికవడం విశేషం. ఈ విషయాన్ని రానా దగ్గుబాటి(Rana Daggubati ) తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు మూవీ టీమ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఈ ఈవెంట్ గోవాలోని పనాజీ(Panaji)లో నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో మొత్తం వివిధ భాషలకు సంబంధించిన 25 సినిమాలు ప్రదర్శించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story