AP High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిల నియామకం

by Jakkula Mamatha |
AP High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిల నియామకం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టు(AP High Court)కు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఈ క్రమంలో ముగ్గురు అదనపు జడ్జిల(Additional Judges) నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులోనే న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌లు అదనపు జడ్జిలుగా నియమించారు. వీరి నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు(Supreme Court) కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదించిన విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి(Union Law Minister) అర్జున్‌రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అలాగే కర్ణాటక హైకోర్టులో అదనపు జడ్జిగా ఉన్న జస్టిస్ సిద్ధయ్య రాచయ్యను అదే హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమించినట్లు తెలిపారు. తాజా నియామకాలతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed