ఐఐటీ విద్యార్థుల సృష్టే కాటమయ్య రక్ష కిట్లు : ఎమ్మెల్యే జై వీర్

by Aamani |   ( Updated:2024-10-25 08:18:44.0  )
ఐఐటీ విద్యార్థుల సృష్టే కాటమయ్య రక్ష కిట్లు : ఎమ్మెల్యే జై వీర్
X

దిశ, హాలియా : హైదరాబాద్ ఐఐటీ విద్యార్థుల సృష్టితోనే కాటమయ్య రక్ష కిట్లు రూపొందించారని, వీటి ద్వారా గీత కార్మికులకు పూర్తి రక్షణ ఉంటుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన కాటమయ్య రక్ష కిట్లను శుక్రవారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గీత కార్మికులు చెట్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు మోకులు తెగి ప్రమాదాలకు గురయ్యారని తద్వారా శాశ్వతంగా అంగ వైకల్యం తో పాటు ప్రాణాలు సైతం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

గీత కార్మికులకు పూర్తి రక్షణ కవచంగా హైదరాబాద్ లోని ఐఐటీ విద్యార్థులు చేపట్టిన వినూత్న సృష్టి ద్వారా కాటమయ్య రక్షా కిట్లను తయారు చేసి వాటి ద్వారా కార్మికులకు ఎటువంటి ప్రమాదాల జరగకుండా రూపొందించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో గీత కార్మికుల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రమాదాలకు గురైన సమయంలో బీమా సౌకర్యం కల్పిస్తుందని అంతేకాకుండా ఆ కుటుంబాలకు పూర్తి ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. మొదటి విడతగా నియోజకవర్గానికి 100 కిట్లను మంజూరు చేసిందని విడతల వారీగా అన్ని గ్రామాల్లో గీత కార్మికులకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

అంతేకాకుండా ఇతర కులాల్లో కల్లు గీసే కార్మికులు ఉన్నట్లయితే ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న లేకున్నా కాటమయ్య రక్షా కిట్లు అంత చేయడం జరుగుతుందని తెలిపారు.కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, అంకతి సత్యం, వైస్ చైర్మన్ కాల్ సాని చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు కాకునూరు నారాయణ గౌడ్, కుందూరు వెంకటరెడ్డి, కృష్ణ నాయక్, భాస్కర్ నాయక్, వెంపటి శ్రీనివాస్, గౌని రాజా రమేష్ యాదవ్, పిల్లి ఆంజనేయులు, ప్రసాద్, హాలియా ఎక్సైజ్ సీఐ కల్పన, ఎస్ఐలు, సిబ్బంది, పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed

    null