- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP ఎన్నికల వేళ రూట్ మార్చిన కేసీఆర్.. 17 లోక్‌సభ సెగ్మెంట్లను టచ్ చేసేలా మాస్టర్ ప్లాన్..!
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికలకు స్పీడ్ పెంచుతోంది. త్వరలోనే బస్సుయాత్ర ప్రారంభించాలని భావిస్తోంది. అందుకోసం రూట్ మ్యాప్‌ను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాల్లో యాత్రను కొనసాగించనున్నట్లు సమాచారం. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 10 వేల మందితో సభ నిర్వహించనున్నారు.
15న మెదక్‌లో సన్నాహక సభ
లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్ఎస్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. గతానికి భిన్నంగా సభలతో కాకుండా బస్సుయాత్రలు చేపట్టాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 15న మెదక్‌లో ఎన్నికల సన్నాహకంలో భాగంగా బహిరంగసభను నిర్వహిస్తున్నారు. ఆ సభ తర్వాత అక్కడి నుంచి బస్సు యాత్రను కేసీఆర్ ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అన్ని పార్లమెంటు పరిధిలోనూ కేసీఆర్ స్వయంగా పర్యటించనున్నారు.
రైతుల్లో భరోసా
బస్సుయాత్రలో భాగంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలకు పార్టీ ప్లాన్ చేస్తుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మండలాల్లోనూ యాత్ర కొనసాగనుంది. ఆయా మండలాల్లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏర్పడిన కరువు పరిస్థితులు, సాగు, తాగునీటి కొరత విషయాలను ప్రజలనుంచి కేసీఆర్ అడిగి తెలుసుకోనున్నారు. ఎండిన పంటల పరిశీలన చేసి రైతుల్లో భరోసా నింపనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రస్తావించడంతో పాటు అధికారంలోకి రాగానే చేస్తామన్న అంశాలను ప్రజలకు వివరించనున్నారు. నాలుగునెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా ప్రజలకు వివరించి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధిపొందాలని భావిస్తున్నారు.
కరీంనగర్ పర్యటనతో జోష్
ఎండిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్ పొలంబాట పేరుతో ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, రైతుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేసీఆర్ పర్యటిస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో తాగు, తాగునీటికి చేసిన పనులను వివరించడంతో పాటు ప్రస్తుత పరిస్థితులను వివరించడంతో ప్రజల నుంచి ఆదరణ వస్తుందని పార్టీ భావిస్తుంది. అందుకే బస్సుయాత్రకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం.
యాక్టివ్‌గా ఉన్నవారికి బాధ్యతలు
పార్టీ కేడర్‌లో నైరాశ్యం పోలేదు. దీనికి తోడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు సైతం పార్టీ మారుతుండటంతో బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. దానికి అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ నయా స్కెచ్ వేసి బస్సుయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. యాత్రలతో తనదైన శైలీలో విమర్శలు చేయనున్నారు. ఇతర పార్టీలకు వెళ్లే ఆలోచన రాకుండానే వారిని కట్టడి చేయడంతో పాటు గ్రామస్థాయిలో పార్టీ కమిటీలను సైతం పూర్తి స్థాయిలో వేయాలని భావిస్తున్నారు. యాక్టివ్‌గా ఉన్నవారికి బాధ్యతలు అప్పగించి, పార్లమెంటు ఎన్నికల తర్వాత కేడర్‌కు శిక్షణ కార్యక్రమాలు సైతం చేపట్టేందుకు ఆలోచనను పార్టీ అధిష్టానం చేస్తున్నట్లు సమాచారం. బస్సు యాత్రలు పార్టీకి లోక్‌సభలో ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.