గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు సర్కార్ చేయూత : జగిత్యాల ఎమ్మెల్యే

by Aamani |
గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు సర్కార్ చేయూత : జగిత్యాల ఎమ్మెల్యే
X

దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 5 గురు గల్ఫ్ కార్మికులు గల్ఫ్ లో మరణించగా వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.25 లక్షల రూపాయల విలువగల ప్రొసీడింగ్ కాపీలను జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సంక్షేమం పై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందని,ఉపాధి నిమిత్తం గల్ఫ్ కి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల పరిహారం చాలా గొప్ప కార్యక్రమం అని,గత దశాబ్ద కాలం నుండి గల్ఫ్ సంఘాలు,ఎన్నారై సంఘాలు,ఎన్నారై పాలసీ కోసం అనేక మార్లు వినతి సమర్పించిన గత ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు, ముఖ్యమంత్రి గల్ఫ్ కార్మికుల భాధలను అర్థం చేసుకొని 5 లక్షలు అందజేయటం వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా భరోసా ఇచ్చారన్నారు.

గురుకుల పాఠశాలలో కళాశాలలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లలకు ప్రాధాన్యంఇస్తామన్నారు. ఈనెల 30 వరకు నిర్వహించే రైతు పండుగలో రైతులందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు ,మాజీ జెడ్పిటిసి ఎల్లారెడ్డి , నాయకులు బాల ముకుందం,గడ్డం నారాయణరెడ్డి,చెరుకు జాన్, చిర్ర నరేష్ ,రాజేశ్వర్ రెడ్డి, ప్రకాష్, రవీందర్రావు, గుంటి రవి, శ్రీనివాసరావు, శాంతపు రావు,జైరాం సురేష్, వెంకటేష్ ,రాజు, మోహన్ రెడ్డి ,సునీల్ ,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story