- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐదేండ్లలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు.. సీఎం రేవంత్ సమక్షంలో సంతకాలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ‘వి-హబ్’ అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ (డబ్ల్యుకేహెచ్) సంస్థల మధ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఆ కంపెనీ తరఫున గ్రెగ్ వాల్ష్, ఫణి కర్రా తెలంగాణ వి-హబ్ తరఫున సీఈఓ సీత సంతకాలు చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం సోమవారం జరిపిన చర్చల్లో తక్షణం ఐదు మిలియన్ డాలర్లను వి-హబ్ లో పెట్టుబడిగా పెట్టడానికి అవగాహన కుదిరింది. రానున్న ఐదేండ్ల కాలంలో దీన్ని 100 మిలియన్ డాలర్లకు పెంచుతామని ఆ సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, వినూత్న ఆలోచనలతో స్టార్టప్‌లను పెట్టి గ్రామీణ, పట్టణ ప్రజలకు సేవలందించడానికి ఇది దోహదపడుతుందని గ్రెగ్ వాల్ష్, ఫణి కర్రా పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు ఉపయోగపడేలా తెలంగాణకు చెందిన వి-హబ్‌తో అవగాహనా ఒప్పందానికి డబ్ల్యుకేహెచ్ సంస్థ ముందుకు వచ్చినందుకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. మహిళలను ప్రోత్సహించడం ద్వారా సమాజమే విముక్తి చెందుతుందని, రాష్ట్ర నిజమైన పొటెన్షియల్ ఇలాంటి ఒప్పందాలతో, ఎంకరేజ్‌మెంట్‌తో సాకారమవుతుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఏ సమాజం కూడా మహిళలను ప్రోత్సహించకుండా అన్ని రంగాల్లో సంపూర్ణమైన ప్రగతిని, ఫలితాలను సాధించడం సాధ్యం కాదన్నారు. అమెరికా వెలుపల సింగపూర్‌లో తమ సంస్థ ఆపరేషన్స్ ఉన్నాయని, తెలంగాణలో ఇప్పుడు అడుగు పెట్టడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రజలకు మహిళా స్టార్టప్‌ల ద్వారా ప్రయోజనం కలగడం సంతోషంగా ఉంటుందని డబ్ల్యూకేహెచ్ ప్రతినిధి గ్రెగ్ వాల్ష్ వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ఈ సహకారం మరింత బలపడుతుందన్నారు.
ఒప్పందం కుదిరిన సందర్భంగా ఫణి కర్రా మాట్లాడుతూ, తాను ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని, ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి అక్కడి విద్యాభ్యాసమే కారణమన్నారు. తాను చదువుకున్న నగరానికి ఈ రూపంలో తిరిగి ఉపయోగపడడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వి-హబ్‌కు ఆర్థికంగా సహకారం అందించడం, భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వి-హబ్ సీఈఓ సీత మాట్లాడుతూ, సీఎం, పరిశ్రమల మంత్రి చొరవతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు దీనికి పునాది వేశాయన్నారు. ఇప్పుడు డబ్ల్యూకేహెచ్ ద్వారా వస్తున్న పెట్టుబడులతో మహిళల వినూత్న ఆలోచనలతో అందుబాటులోకి వచ్చే స్టార్టప్ సర్వీసును అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి వృద్ధి చేయడానికి దోహదపడుతుందన్నారు.
న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజి సందర్శన :
అమెరికా పర్యటన సందర్భంగా న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజిని సీఎం నేతృత్వంలోని తెలంగాణ టీమ్ సందర్శించింది. ప్రతి నిత్యం అక్కడ జరుగుతున్న స్టాక్ మార్కెట్ లావాదేవీలు, తెలంగాణ/భారత్ మూలాలున్న కంపెనీల షేర్ ట్రేడింగ్ తదితరాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. భారత్‌లోని స్టాక్ మార్కెట్ రోజువారీ వ్యవహారాలకు వాడుకున్న టెక్నాలజీని, ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజిలోని సాంకేతిక పరిజ్ఞానం గురించి వారి మధ్య చర్చలు జరిగాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజి కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాకుండా గ్లోబల్ ఎకానమీపై ప్రభావం చూపే ఒక ఐకనిక్ భవనంగా ఉంటుందని నిర్వహాకులు సీఎంకు వివరించారు. ఆ స్టాక్ ఎక్చేంజి చరిత్ర, భవన నిర్మాణం, ఆ దేశానికి మాత్రమే కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే గుర్తింపుగా ఉన్న అంశాలను పరస్పరం చర్చించుకున్నారు.