- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అనూహ్య పరిణామం.. పీఎం ఆఫీస్ కు లింక్?
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ హైకోర్టుకు సిట్ అధికారులు కీలక సమాచారాన్ని అందించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌లు ఢిల్లీ పెద్దలతో దిగిన ఫోటోలు, వారు ఢిల్లీ పెద్దలతో చేసిన వాట్సాప్ చాటింగ్‌ను సిట్ బృందం కోర్టుకు సమర్పించింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని బీజేపీ ఆరోపిస్తున్న తరుణంలో సిట్ సేకరించిన కీలకమైన సమాచారాన్ని కోర్టు ముందు ఉంచడం సంచలనంగా మారుతోంది. ఈ కేసులో దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా సిట్ తరపున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే సిట్ వద్ద కీలకమైన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్ మరో ఐదేళ్ల పాటు సర్వీస్ లో కొనసాగుతారని అందువల్ల ఆయన రాబోయే సర్వీస్ కాలంలో దేశంలో ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసు దర్యాప్తులో ఎక్కడా పక్షపాతం చూపడం లేదని దవే కోర్టులో వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన ఆధారాలలో రామచంద్ర భారతికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షార్ట్ లను సిట్ బృందం కోర్టుకు సమర్పించింది. రామచంద్ర భారతి పంపిన సందేశానికి బీఎల్ సంతోష్ రిప్లే ఇచ్చినట్టుగా ఉన్న డాక్యుమెంట్లో ఏకే సింగ్ అనే వ్యక్తి నమ్మకమైన వాడని అలాగే ఆర్ వసిస్ట్ అనే వ్యక్తి గురించి మాట్లాడాల్సి ఉందని సంతోష్ రామచంద్ర భారతికి రిప్లే ఇచ్చినట్టుగా ఉంది. అయితే వసిస్ట్ అనే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి చెందిన వ్యక్తి అని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సందర్భంగా సిట్ అధికారులు బీజేపీ పెద్దలతో నిందితులు దిగిన ఫోటోలను కోర్టుకు సమర్పించారు. అందులో గతంలో బీఎల్ సంతోష్ తో రామచంద్ర భారతి కలిసిన ఫోటోలతో పాటు వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ కన్వర్జేషన్ కు సంబంధించిన కాల్ డేటాను సిట్ సేకరించించి కోర్టుకు సమర్పించింది. తాజా పరిణామంతో ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
READ MORE