- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో 20 ఏళ్లలో సింగరేణి మూతపడే ప్రమాదం: MLA కూనంనేని
దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణి ఎన్నికలతో రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, ఈ విషయంలో కాంగ్రెస్, సీపీఐకి మధ్య తగువులు లేవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా ఉన్నందునే దాని గురించి మాట్లాడుతున్నట్లు తెలిపారు. పోటీ చేస్తున్న ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీలకు కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ కొంత అనుబంధం ఉందన్నారు.
గతంలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ఉన్నప్పటికీ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ విడివిడిగా పోటీ చేశాయని, అలాగే టీడీపీతో పొత్తు ఉన్నా సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో టీఎన్‌టీయూసీ, ఏఐటీయూసీలు వేర్వేరుగానే పోటీ చేశాయని గుర్తు చేశారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు విస్తరించిన నియోజకవర్గాలలో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మంచి మెజారిటీ వచ్చేందుకు కార్మికులు, ఏఐటీయూసీ, సీపీఐ కృషి కూడా కారణమని చెప్పారు. మరోవైపు మరో 15 నుంచి 20 ఏళ్లలో సింగరేణి కాలరీస్ మూతపడే దుస్థితిలో ఉన్నదని కూనంనేని ఆందోళన వ్యక్తం చేశారు.