- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA లాస్య నందిత కారు ప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్
దిశ, రాచకొండ : ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం ఘటనలో షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదం శుక్రవారం ఉదయం 5.30 నుంచి 6 గంటల సమయం లో జరిగినట్లు సంగారెడ్డి పోలీసులు గుర్తించారు. కార్ స్పీడో మీటర్ 100 దగ్గర ఆగిందని పోలీసుల విచారణ లో స్పష్టమైంది. బాసర నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
అయితే ఓఆర్ఆర్‌పై ప్రమాదం చోటుచేసుకున్న దగ్గర 500 మీటర్‌ల దూరం లోనే ఎమ్మెల్యే కార్ హెడ్ లైట్స్ కింద పడి ఉండడం, 500 మీటర్‌ల నుంచి బ్రేక్ వేసినట్లు రోడ్డు పై టైర్ మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వెనకాల నుంచి గుర్తు తెలియని వాహనం గుద్ది ఉంటుందని అనుమానం ఉండగా, ఎమ్మెల్యే కారు నడిపిస్తున్న డ్రైవర్ ఆకాష్ ముందు ఉన్న కారును ఆకస్మాత్తుగా గుర్తించి దానిని తప్పించేందుకు బ్రేక్, లేదా హ్యాండ్ బ్రేక్ వేశాడా అనే అనుమానాలను పోలీసు వ్యక్తం చేస్తున్నారు.