- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడులో TRSకు షాక్.. భారీగా నామినేషన్లకు రంగం సిద్దం
దిశ, తెలంణ బ్యూరో: ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోతున్న పలు వర్గాల వారు.. మునుగోడు ఉప ఎన్నికను వేదికగా మార్చుకుంటున్నారు. బైపోల్‌లో నామినేషన్లు వేసి అధికార పార్టీలో సెగ పుట్టించాలని భావిస్తున్నారు. ఇప్పటికే 101 మందితో నామినేషన్స్ వేయించేందుకు రెడీగా ఉన్నామని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో గజ్జకట్టి, డప్పుకొట్టి ప్రజలను చైతన్యం చేసిన కళాకారులు సైతం తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు సుమారు 300 మంది నామినేషన్స్ వేయనున్నారు. వీఆర్ఏ జేఏసీ సైతం వెయ్యి మందితో నామినేషన్స్ వేయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మర్రిగూడ మండలం కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం పరిధిలోని ముంపునకు గురైన ఆరు గ్రామలకు చెందిన ప్రజలు ఇంటికొకరు చొప్పున నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా భారీగా నామినేషన్లు వేయడం వల్ల ఇటు అధికార పార్టీతో పాటు అటు మిగతా రెండు ప్రధాన పార్టీల ఓట్లపైనా ప్రభావం పడే చాన్స్ ఉంది.