TG: విద్యార్థులకు భారీ షాక్.. వేసవి సెలవుల్లో మార్పులు!!

by Anjali |   ( Updated:2024-04-04 12:02:39.0  )
TG: విద్యార్థులకు భారీ షాక్.. వేసవి సెలవుల్లో మార్పులు!!
X

దిశ, వెబ్‌డెస్క్: మార్చి వచ్చిందంటే విద్యార్థుల దృష్టంతా వేసవి సెలవుల మీదనే ఉంటుంది. పరీక్షలు ఎప్పుడెప్పుడు ముగుస్తాయా అని వేచి చూస్తుంటారు. ఇటీవల ఏపీలోప్రభుత్వం పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వేసవి సెలవుల కోసం తెలంగాణ విద్యార్థులు ఎదురుచూస్తు్న్నారు. ఏప్రిల్ 24 వరకు ఈసారి పాఠశాలలు నడుస్తుండటంతో 25 నుంచి వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. పిల్లల్ని స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వరకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయని తెలుస్తోంది.

ఇకపోతే ఒకటి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే SA-2 ఎగ్జామ్స్ ను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల (ఏప్రిల్) 15 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 1-7 తరగతుల విద్యార్థులకు ఉదయం. 9 - 11.30 గంటల వరకు, 8 వ తరగతి వాళ్లకు ఉదయం. 9 - 11.45 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం. 9-12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపింది. కాగా 23న ఫలితాలు ఉండనున్నాయని, పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తామని పేర్కొంది. అనంతరం పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించనుంది.

Advertisement

Next Story

Most Viewed