- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్.. పేట్ బషీరాబాద్‌లో హైటెన్షన్!
దిశ, పేట్ బషీరాబాద్: మా ప్రాణాలకు తెగించి మా భూమి మేం కాపాడుకుంటాం.. అప్పటిదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదు.. మీకు దండం పెడతా” అంటూ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు పోలీసులతో తేల్చి చెప్పారు. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్డులో సర్వే నంబర్ 81, 82 లో ఉన్న 2ఎకరాల 10 గుంటలు ఎమ్మెల్యేలకు చెందిన భూమిలో కొందరు కబ్జా చేస్తున్నారంటూ శనివారం ఉదయం మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కొడుకు భద్రారెడ్డిలు ముందుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి చెప్పినప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో కబ్జా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి కబ్జాను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పేట్ బషీరాబాద్ పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘర్షణను అడ్డుకున్నారు. ఇరు వర్గాలకు సముదాయించే ప్రయత్నం చేశారు. కాగా రాత్రికి రాత్రి తమ భూమిని కబ్జా చేసి వేసిన రేకుల ఫెన్సింగ్‌ను ఉదయం మల్లారెడ్డి అనుచరులు కూల్చివేశారు. పోలీసులు వన్‌సైడ్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యేలు ఆరోపించారు.