ఇక్కడ ఒక్క సీట్ గెలిచిన.. మా పవర్ ఏంటో చూపిస్తాం : సింకారు శివాజీ

by Vinod kumar |
ఇక్కడ ఒక్క సీట్ గెలిచిన.. మా పవర్ ఏంటో చూపిస్తాం : సింకారు శివాజీ
X

దిశ, వెబ్‌డెస్క్: శివ సేన పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పసులోటి గోపికిషన్ ఆధ్వర్యంలో జిల్లా శివ సేన పార్టీ కార్యకర్తల సమావేశం బోధన్‌లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా శివ సేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన తర్వాత మొదటి సారిగా జిల్లాలో పర్యటనకు వచ్చిన ఆయనకి జిల్లా వ్యాప్తంగా శివసేన పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి భారీ బైక్‌ ర్యాలి నిర్వహించారు. బోధన్ ఆచన్ పల్లి నుండి ప్రారంభమై భారీ బైక్‌ ర్యాలి బస్టాండ్ మీదుగా కొనసాగింది.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు ఖంఢించాల్సిన అవసరం ఉందని అన్నారు. హిందూత్వ రక్షణకై పాటుపడుతూన్న వారికి శివ సేన పార్టీ ఎల్లప్పుడు మద్దతుగా అండగా నిలబడటానికి సిద్ధంగా ఉందని తెలిపారు. రానున్న శాసన సభ ఎన్నికలలో శివ సేన పార్టీ 119 స్థానాలు పోటి చేస్తుందని.. బోధన్ నియోజకవర్గంలో శివ సేన పార్టీ అభ్యర్థిగా పసుపులేటి గోపి కిషణ్‌ శాసన సభ ఎన్నికలలో కచ్చితంగా గెలిపించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా పేరు మార్చడం ఎవరి తరం కాదని కానీ మేము జిల్లాలో ఒక్క సీటు గెలిచిన కచ్చితంగా పేరు మార్చేందుకు కృషి చేసి ఇందూర్‌ జిల్లాగా నామకరణం చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కి దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాలు పోటి చెయ్యాలని సవాల్ చేశారు. MIM పార్టీతో జత కట్టిన కేసీఆర్ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీతో కూడా కలుస్తాడన్నారు.


కేసీఆర్ మహారాష్ట్రలో ఎలాంటి ప్రభావం చూపెట్టే అవకాశం లేదని.. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉంటె అవన్నీ గాలికీ వదిలేసి మహారాష్ట్ర చుట్టు తిరుగుతున్నారని విమర్శించారు. విద్యా విధానం పైన ఏ మాత్రం ప్రేమ లేకుండా రాజకీయ ప్రయోజనాలే మొదటి ఎజెండాగా ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వానికీ తగిన బుద్ది చెప్పి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి గోపి కిషణ్‌ బోధన్ MLA అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గెలుపు కోసం ప్రతీ ఒక్క కార్యకర్త పని చెయ్యలని పిలుపునిచ్చారు.


బోధన్ పట్టణంలో శివ సేన పార్టీ ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం విషయంలో జైలుకు వెళ్ళిన వారిని ఆ కేసులో పేర్లు ఉన్న ప్రతీ ఒక్కరినీ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ వేదికపైన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భోధన్ పట్టణ అధ్యక్షుడు పాండవుల భూమేష్, యువసేన అధ్యక్షుడు ప్రీతమ్ గౌడ్, యువ నాయకుడు గౌతమ్ గౌడ్, BVS నాయకుడు లోకేష్, భోధన్ మండల ప్రధాన కార్యదర్శి ద్రౌపది లక్ష్మణ్, మండల యవసేన అధ్యక్షుడు ఆకులరాజు, ఆర్మూర్ మండల నాయకులు, నవిపేట మండల నాయకులు తదితరులు పాల్గోన్నారు.

Advertisement

Next Story

Most Viewed