హైదరాబాద్ శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ మూసివేత

by M.Rajitha |
హైదరాబాద్ శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది జీహెచ్ఎంసీ. శిల్పా లేఅవుట్ లెవల్-2 ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున 5 రోజుల పాటు శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ను మూసివేయనున్నట్లు తెలిపారు. నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పించేందుకు అనేక ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టింది జీహెచ్ఎంసీ. అందులో కొన్నిటి నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా.. మరికొన్నిటి పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఎస్ఆర్డీపీ శిల్పా లేఅవుట్ లెవల్-2 గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు అధికారులు. అయితే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాత్రి పూట మాత్రమే పనులు నిర్వహించేలా జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. ఇందుకోసం ఈ నెల 12వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఫ్లైఓవర్ ను మూసి వేయనున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ఓ ప్రకటనలో తెలిపారు. బయోడైవర్సిటీ జంక్షన్ నుండి ఐఐటీ జంక్షన్ వైపు వెళ్ళే వాహనాలను బ్రిడ్జి గుండా టెలికాం నగర్ నుండి గచ్చిబౌలి జంక్షన్ వైపుకు మళ్లించారు. ఇక ఐఐటీ జంక్షన్ నుండి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు వెళ్ళే వాహనాలు బ్రిడ్జీ గుండా వెళ్లాలని సూచించారు. వాహనదారులు ఈ నిబంధనలు దృశతిలో ఉంచుకొని ప్రత్యేక సమయాల్లో ట్రాఫిక్ సిబ్బందికి, జీహెచ్ఎంసీ అధికారులకు సహకరించాలని కోరారు.

Next Story